- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Adani Group's: అదానీ పునరుత్పాదక ఇంధన విజన్ భేష్.. భూటాన్ ప్రధాని ప్రశంసలు
దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లోని ఖవ్డా, ముంద్రా పోర్ట్‌లోని అదానీ గ్రూప్‌కు చెందిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టు సైట్‌ను భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్‌గే బుధవారం సందర్శించారు. ఇంధన కార్యక్రమాలను ప్రశంసించారు. గౌతమ్ అదానీని తన స్నేహితుడిగా అభివర్ణించారు. గ్రీన్ ఎనర్జీలో తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి అనేక అవకాశాలు ఉన్నాయని చెప్పారు. తన పర్యటన భారత్, భూటాన్ మధ్య ఉన్న సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు. పర్యటనలో భాగంగా ఆయన గిఫ్ట్ సిటీ, స్టాట్యూ ఆఫ్ యూనిటీని సందర్శించారు, దీనిని టోబ్గే తీర్థయాత్రగా అభివర్ణించారు. భారత్ పట్ల ప్రధాని మోడీ విజన్‌ను తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పర్యావరణ అనుకూల కార్యక్రమాలకు భూటాన్ మద్దతిస్తుందని నొక్కి చెప్పారు. తన పర్యటనకు ఏర్పాట్లు చేసి ఆతిథ్యం ఇచ్చిన గుజరాత్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, అంతకుముందు యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి, జపాన్ రాయబారి హిరోషి సుజుకీతో సహా అంతర్జాతీయ ప్రముఖులు ప్రాజెక్టును సందర్శించి పునరుత్పాదక ఇంధనంలో అదానీ చేసిన కృషిని ప్రశంసించారు.