కేజ్రీవాల్ పై కుట్ర జరుగుతోంది.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్

by Javid Pasha |   ( Updated:2023-04-14 14:06:48.0  )
కేజ్రీవాల్ పై కుట్ర జరుగుతోంది.. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ ఇవాళ నోటీసులు జారీ చేసింది. కాగా ఈ వ్యవహారంపై ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ స్పందించారు. అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ సమన్లు ఇవ్వడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షపార్టీల ప్రభుత్వాలను కూలగొట్టడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ పై కుట్ర జరుగుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. లక్షల కోట్ల ప్రజా ధనాన్ని ప్రధాని మోడీ తన మిత్రులకు ధారాదత్తం చేస్తున్నారన్న ఆయన.. ఈ విషయాన్ని ప్రశ్నించినందునే కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు పంపించారని ఫైరయ్యారు. నోటీసులకు భయపడేదిలేదని, మోడీ అవినీతి ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ నెల 16న అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ విచారణకు హాజరవుతారని ఆయన తెలిపారు.

Also Read..

లిక్కర్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు నోటీసులు

Advertisement

Next Story

Most Viewed