Aam Aadmi Party: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. రెండో జాబితా విడుదల చేసిన ఆప్

by Shamantha N |
Aam Aadmi Party: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. రెండో జాబితా విడుదల చేసిన ఆప్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల(Delhi Assembly polls) కోసం ఆమ్ ఆద్మీ పార్టీ(Aam Aadmi Party) రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. తొలి జాబితాలో 11 మంది అభ్యర్థుల పేర్లును ప్రకటించిన ఆప్.. 20 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. 70 స్థానాలున్న అసెంబ్లీలో 39 స్థానాలకు అధికార పార్టీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాగా.. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా(Manish Sisodia) రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జంగ్‌పురా నుంచి పోటీ చేయనున్నారు. సివిల్ సర్వీసెస్ టీచర్ అవధ్ ఓజా(Avadh Ojha) తూర్పు ఢిల్లీలోని పట్ పర్ గంజ్ నుంచి బరిలో దిగనున్నారు. కాగా.. ప్రస్తుతం ఆ నియజకవర్గం నుంచి ఆప్ ఎమ్మెల్యేగా సిసోడియా ఉన్నారు. ప్రస్తుత జంగ్‌పురా ఎమ్మెల్యేగా ఉన్న ప్రవీణ్‌కుమార్‌కు జనక్‌పురి స్థానం కేటాయించింది.

సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో..

కాగా.. రెండోజాబితాలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలెవరికీ వారిస్థానాలు రిపీట్ కాకపోవడం గమనార్హం. అధికార వ్యతిరేకతను, ఫిర్యాదులను ఎదుర్కోవడమే లక్ష్యంగా ఆప్ సీట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. ఇకపోతే, జంగ్‌పురా నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చినందుకు కేజ్రీవాల్‌కి, పార్టీకి సిసోడియా ధన్యవాదాలు తెలిపారు. పట్‌పర్‌గంజ్ "ఢిల్లీలో విద్యా విప్లవానికి ముఖ్యప్రాంతం" అని సిసోడియా చెప్పుకొచ్చారు. ఇకపోతే, వచ్చేఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి కూడా అధికారాన్ని చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ఆప్ పనిచేస్తోంది.

Advertisement

Next Story