ఆ డబ్బులు కావాలంటే ఖచ్చితంగా Aadhaar number ఉండాల్సిందే.. రాష్ట్రాలకు కీలక ఆదేశాలు

by Sathputhe Rajesh |   ( Updated:2022-08-17 03:58:02.0  )
ఆ డబ్బులు కావాలంటే ఖచ్చితంగా  Aadhaar number ఉండాల్సిందే..  రాష్ట్రాలకు కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డు అనేది తప్పనిసరి అయింది. జేబులో ఆధార్ కార్డు లేనిది ఏ పని అవ్వడం లేదు. ఏ పని కోసం వెళ్లినా ఆధార్ కార్డు ప్రూఫ్ అడుగుతున్నారు. సిమ్ తీసుకోవాలన్నా.. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా.. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందాలన్నా.. ఇలా ఏ పనికైనా సరే ఆధార్ కార్డు తప్పనిసరి అయింది. ఆధార్ లేనేది అసలు ఏ పని కూడా జరగడం లేదు.

తాజాగా యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆధార్ రూల్స్ ను మరింత కఠినతరం చేసింది. ఇప్పటినుంచే ప్రభుత్వ సంక్షేమ పథకాలు లేదా సబ్సిడీలు పొందాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించింది. ఆధార్ నెంబర్ లేదా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ స్లిప్ లేకపోతే ప్రభుత్వ స్కీమ్ లు, సబ్సిడీలు పొందలేరని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ రంగ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ఆధార్ లేనివారు ఎలాంటి పథకాలు, సబ్సిడీలు పొందలేరని పేర్కొంది.

ఆధార్ చట్టంలోని సెక్షన్ 7 ప్రకారం ఆధార్ నెంబర్ లేని వారికి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీలు పొందే అవకాశముంది. అయితే ఆధార్ లేకపోతే ఎన్‌రోల్‌మెంట్ చేయించి స్లిప్ ను ఆధారంగా తీసుకుంటారు. ఎన్‌రోల్‌మెంట్ స్లిప్ ఉన్నా సరే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీ బెనిఫిట్స్ పొందవచ్చు.

ఇవి కూడా చ‌ద‌వండి :

ఆధార్ కార్డు, ఓటీపీ ద్వారా యూపీఐ సేవలు!

LRS‌ కు 'ఆధార్' తప్పనిసరి..

పెళ్లి తర్వాత ఆధార్ కార్డ్‌లో ఇంటిపేరును ఇలా మార్చుకొండి

ఆధార్ అథెంటికేషన్‌కు కొత్త యాప్.. ఎక్కడి నుంచైనా బయోమెట్రిక్ పూర్తి

ఆధార్ కార్డు ఫోటో కాపీని షేర్ చేస్తున్నారా..? చాలా డేంజర్.

త్వరలోనే ఆధార్‌లో మారనున్న జిల్లాల అడ్రస్‌లు..?

Advertisement

Next Story