ఆ స్టేషన్లో ఆగకుండా వెళ్లిన ట్రైన్.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకవడం ఖాయం

by Javid Pasha |
ఆ స్టేషన్లో ఆగకుండా వెళ్లిన ట్రైన్.. తర్వాత ఏం జరిగిందో తెలిస్తే షాకవడం ఖాయం
X

దిశ, వెబ్ డెస్క్: కచ్చితంగా ఆగాల్సిన స్టేషన్ లో ఓ ట్రైన్ ఆగకుండా ముందుకు వెళ్లిపోయింది. దీంతో అక్కడ వేచి చూస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. అయితే కొంతదూరం వెళ్లాక ఆ ట్రైన్ మళ్లీ వెనక్కి తిరిగొచ్చింది. దీంతో ఆ ప్రయాణికులు మరింత షాక్ కు గురయ్యారు. ఒక్కసారి స్టేషన్ దాటిందంటే ముందుకు వెళ్లే ట్రైన్లను తప్ప ఏనాడు వెనక్కి వచ్చిన ట్రైన్లను చూడని ఆ ప్రయాణికులు ఆశ్యర్యానికి గురయ్యారు. ఈ ఘటన కేరళ రాష్ట్రం అలప్పుజా జిల్లాలోని చెరియానద్ రైల్వే స్టేషన్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. షోరనూర్ వెళ్లే వేనాడ్ ఎక్స్‌ప్రెస్ అలప్పుజా జిల్లాలోని చెరియానద్ రైల్వే స్టేషన్ కు చేరుకుంది. అయితే లోకో పైలట్ అక్కడ ట్రైన్ ఆపకుండా ముందుకు పోనిచ్చాడు.

దీంతో అక్కడ వేచి చూస్తున్న ప్రయాణికులు ఖంగుతిన్నారు. స్టాప్ స్టాప్ అంటూ పరుగులు పెట్టారు. కానీ మంచి స్పీడు మీదున్న ఆ లోకో పైలట్ కు ఇవేమీ వినిపించలేదు. అయితే దాదాపు 700 మీటర్ల దూరం వెళ్లాక సదరు లోకో పైలట్ కు తాను చెరియానద్ రైల్వే స్టేషన్ లో ట్రైన ఆపలేదని గ్రహించాడు. వెంటనే ట్రైన్ ను రివర్స్ పోనిచ్చాడు. ఇక ట్రైన్ రివర్స్ రావడం చూసిన ప్రయాణికులు షాక్ తిన్నారు. ట్రైన్ మిస్ అయితే ఇంకో ట్రైన్ ఎక్కి వెళ్లడమే తెలిసిన జనం.. అదే ట్రైన్ వాళ్లను ఎక్కించుకోవడానికి రివర్స్ రావడంతో ఎగ్జైట్ అయ్యారు. అయితే రైల్వే సిబ్బంది వారికి విషయం చెప్పడంతో హ్యాపీగా ట్రైన్ ఎక్కి వెళ్లిపోయారు. ఇక లోకో పైలట్ పై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story