- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కావేరి నది ఒడ్డున రాకెట్ లాంఛర్ లభ్యం.. ఎలా వచ్చిందంటే?
by saikumar |

X
దిశ, నేషనల్ బ్యూరో : తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి జిల్లాలోని ఆందనల్లూరు ఆలయం(Andanallur Temple) సమీపంలో కావేరి నది(Kaveri river) ఒడ్డున ఓ రాకెట్ లాంఛర్(Rocket Launcher) లభ్యమైంది. ఆలయానికి విచ్చేసిన భక్తుల్లో ఒకరు దానిని గుర్తించి ఆలయ అధికారులకు సమాచారం అందించగా.. వారు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. లేత నీలం రంగులో మెరుస్తు ఉన్న మెటల్ డివైజ్‌ను పోలీసులు బయటకు తీసి చూడగా అది రాకెట్ లాంఛర్ అని గుర్తించారు.
అనంతరం దాన్ని భద్రపరచి 117వ ఆర్మీ ఇన్‌ఫాంట్రీ బెటాలియన్‌కు అప్పగించారు. రాకెట్ లాంచర్ కావేరి నది ఒడ్డుకు ఎలా వచ్చిందనే విషయంపై ఆర్మీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆర్మీ అధికారులు టెస్టింగ్ నిర్వహించిన టైంలో కావేరి నదిలో పడిన ఈ రాకెట్ లాంఛర్ ఒడ్డుకు కొట్టుకువచ్చి ఉంటుందని అధికారులు ఆరా తీస్తున్నారు.
Next Story