- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం: ఆ విమానాల కొనుగోలుకు ఆమోదం
దిశ, నేషనల్ బ్యూరో: భారత రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.15 సముద్ర గస్తీ విమానాల కొనుగోలుకు ఆమోదం తెలిపినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇండియన్ నేవీకి9, కోస్ట్ గార్డ్‌కు 6 విమానాలను అందించేందుకు అంగీకరించినట్టు పేర్కొన్నాయి. మేడ్ ఇన్ ఇండియాలో భాగంగా టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ అండ్ ఎయిర్ బస్ మధ్య జాయింట్ వెంచర్‌లో తయారుచేయబడుతున్న సీ-295 విమానాల తరహాలోనే ఈ 15 సముద్ర గస్తీ విమానాలను రూపొందించనున్నారు. దీనికి రూ.29,000 కోట్లు ఖర్చు అవుతుందని రక్షణ శాఖ అంచనా వేస్తు్న్నది. వీటి కొనుగోలుతో దేశ భద్రతా అవసరాలను తీర్చడం, స్వదేశీ రక్షణ ఉత్పత్తులను సైతం పెంచేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అంతేగాక రవాణా విమానంలో అవసరమైన రాడార్లు, సెన్సార్లు అమర్చబడి, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ సెంటర్ ఫర్ ఎయిర్‌బోర్న్ సిస్టమ్స్ ద్వారా సముద్ర గస్తీ విమానంగా మారుతుందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, ఇటీవల భారత నౌకాదళం, కోస్ట్ గార్డ్ కోసం దేశీయంగా నిర్మించిన 463 రిమోట్ కంట్రోల్ తుపాకుల తయారీ, సరఫరాకు కాన్పూర్‌కు చెందిన సంస్థతో రూ. 1,752.13-కోట్ల ఒప్పందంపై రక్షణ శాఖ సంతకం చేసింది. ఈ క్రమంలోనే గస్తీ విమానాల కొనుగోలుకు సైతం ఆమోదించడం గమనార్హం.