బ్రేకింగ్: కేరళ- తమిళనాడు హైవేపై రాకపోకలు బంద్.. ఎందుకంటే..?

by Satheesh |   ( Updated:2023-04-27 15:06:39.0  )
బ్రేకింగ్: కేరళ- తమిళనాడు హైవేపై రాకపోకలు బంద్.. ఎందుకంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: కేరళ-తమిళనాడు హైవేపై రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ హైవేపై ప్రయాణిస్తోన్న ఓ ట్యాంకర్ నుండి పెద్దఎత్తున గ్యాస్ లీక్ అవడంతో ముందు జాగ్రత్తలో భాగంగా అధికారులు ఈ హైవేను క్లోజ్ చేశారు. గురువారం ఓ గ్యాస్ ట్యాంకర్ తమిళనాడులోని కోయంబత్తూర్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. గ్యాస్ నుండి పెద్ద ఎత్తున కార్బన్ డై ఆక్సెడ్ లీక్ అవుతోంది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకున్నారు. కార్బన్ డై ఆక్సెడ్ భారీగా లీక్ అవుతుండటంతో ముందు జాగ్రత్తగా ఆ హైవేపై రాకపోకలు నిలిపివేశారు. ఈ ఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో ఉన్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story