త్వరలోనే ఐదుగురికి సుప్రీం జడ్జీలుగా పదోన్నతులు

by Harish |   ( Updated:3 Feb 2023 10:15 AM  )
త్వరలోనే ఐదుగురికి సుప్రీం జడ్జీలుగా పదోన్నతులు
X

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు కొలీజియం ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలపనున్నట్లు హామీ ఇచ్చింది. త్వరలోనే ఐదుగురిని సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమించనున్నట్లు గురువారం తెలిపింది. గత ఏడాది డిసెంబర్ లో ముగ్గురు హైకోర్టు సీజేలు, ఇద్దరు జడ్జిలను సుప్రీంకోర్టు జడ్జీలుగా పదోన్నతులు కల్పించాలని కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కోర్టులో విచారించగా, త్వరలోనే నియామకం చేపడుతామని పేర్కొంది.

కాగా, ఈ ఐదుగురి చేరికతో సుప్రీంకోర్టు జడ్జిల సంఖ్య 32‌కు చేరనుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐ తో కలుపుకుని 27 మంది ఉన్నారు. శుక్రవారం విచారణలో భాగంగా కేంద్రం కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురికి పదోన్నతి కల్పించనున్నట్లు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. వేగవంతంగా ఐదుగురి పేర్లు ప్రకటిస్తారని భావిస్తున్నట్లు కోర్టు పేర్కొంది.

హైకోర్టు జడ్జిల బదిలీల విషయంలో అలసత్వం తీవ్రమైన అంశమని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. అయితే తమకు అసౌకర్యం కలిగించే విధంగా వ్యవహరించొద్దని కేంద్రాన్ని కోరింది. గత కొంత కాలంగా కొలీజియం వ్యవస్థ పై కేంద్రం విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొలీజియం సిఫార్సులపై ప్రకటన చేయడం ఆసక్తికరంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed