- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Wayanad :160 మంది శరీర అవయవాలు లభ్యం.. 180 మంది ఆచూకీ గల్లంతు
దిశ, నేషనల్ బ్యూరో : వయనాడ్ జిల్లాలోని పలు గ్రామాలపై కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఇంకా 180 మంది ఆచూకీ తెలియడం లేదని కేరళ రాష్ట్ర మంత్రి కె.రాజన్ వెల్లడించారు. అయితే 160 మందికి సంబంధించిన శరీర అవయవాలు రెస్క్యూ టీమ్స్‌కు దొరికాయని ఆయన తెలిపారు. ఇప్పటివరకు ప్రభావిత ప్రాంతాల్లో 220 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రి చెప్పారు. 200కుపైగా గుర్తుతెలియని డెడ్ బాడీస్ ఉండగా వాటిలో 171 మృతదేహాలను సంబంధీకులు వచ్చి తీసుకెళ్లారని కె.రాజన్ పేర్కొన్నారు. మరో 34 గుర్తుతెలియని డెడ్‌బాడీస్ మార్చురీలలో ఉన్నాయన్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో వివిధ భద్రతా దళాలకు చెందిన 1382 మంది, 1800 మంది వాలంటీర్లు పాల్గొంటున్నారని కె.రాజన్ చెప్పారు.
369కి పెరిగిన మరణాలు
ఆదివారం సాయంత్రం సమయానికి వయనాడ్‌లోని ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం మరణాల సంఖ్య 369కి పెరిగిందంటూ కేరళ మీడియాలో కథనాలు వచ్చాయి. 206 మంది ఆచూకీ ఇంకా తెలియరావడం లేదని ఆ కథనాల్లో ప్రస్తావించారు. కొండచరియలు విరిగిపడటంతో 1208 ఇళ్లు నేలమట్టం అయ్యాయని పేర్కొన్నారు. వీటిలో 540 ఇళ్లు ముందక్కైలో, 600 ఇళ్లు చూరల్ మలలో, 68 ఇళ్లు అట్టా మలలో ఉన్నాయని తెలిపారు. నదీ ప్రవాహం తీవ్రరూపు దాల్చడంతో దాదాపు 3,700 ఎకరాల వ్యవసాయ భూముల్లోని పంటలు తుడిచిపెట్టుకుపోయాయని కథనాల్లో నివేదించారు.