- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
1,500-year-old skeleton: గొలుసులతో బంధించిన 1500 ఏళ్ల నాటి అస్థిపంజరం.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు!

దిశ, వెబ్ డెస్క్: ఇజ్రాయెల్‌లోని జెరూసలేంలో (Jerusalem) మూడేళ్ల క్రితం 1500 ఏళ్ల నాటి అస్థిపంజరం (1,500-year-old skeleton) పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడింది. ఆ అస్థిపంజరం పూర్తిగా గొలుసులతో (iron shackles) కట్టి బంధించి పాతి పెట్టినట్లుగా పరిశోధకులు గుర్తించారు. తొలుత ఒక పురుషుడి అస్థిపంజరంగా భావించిన పరిశోధకులు.. తాజాగా దానికి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఆ పురాతన అస్థిపంజరాన్ని పరిశీలించిన పరిశోధకులు పురుషుడి అస్థిపంజరం కాదని, ఓ స్త్రీ అస్థిపంజరం అని స్పష్టం చేశారు. ఆమె శరీరంపై ఉన్న గొలుసులు కూడా ఆమెకు విధించిన శిక్ష కాదని, ఆమె స్వయంగా వాటిని ధరించినట్లుగా కనుగొన్నారు. అలాగే, ఆ స్త్రీ సన్యాసి అయి ఉండవచ్చని, మతపరమైన భక్తిలో భాగంగా స్వీయ క్రమశిక్షణలో భాగంగా ఆమెను ఇలా బంధించుకుని ఉంటుందని అభిప్రాయపడ్డారు.
కాగా, 4 శతాబ్ధంలో రోమన్ సామ్రాజ్యంలో క్రైస్తవ మతాన్ని స్వీకరించిన సన్యాసులు ఇలాంటి ఆచారాలనే పాటించే వారని పరిశోధకులు తెలిపారు. తమ జీవితపు చివరి క్షణాల్లో ప్రజలు ఆహారం, పానీయాలను వదులుకుని ఉపవాసం ఉండేవారని, అన్ని రకాల శారీరక సుఖాలను వదులుకునేవారని, ఇందులో భాగంగానే వారిని వారు నియంత్రించుకునేందుకు ఇలా గొలుసులతో బంధించుకునేవారని వివరించారు. అయితే, మొదటల్లో ఈ సంప్రదాయాన్ని కేవలం పురుషులు మాత్రమే స్వీకరించేవారని ది జర్నల్ ఆఫ్ ఆర్కియాలజికల్ సైన్స్‌లో ప్రచురితమైన ఓ కథనంలో తెలిపారు. ఆ తరువాత మహిళలు కూడా ఈ సంప్రదాయాన్ని స్వీకరించడం ప్రారంభించినట్లు పేర్కొన్నారు. కాగా, ఈ అస్థిపంజరంపై ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చ నడుస్తోంది.
Read Also..
విటమిన్ ట్యాబ్లెట్స్ వాడుతూ కాఫీ తాగుతున్నారా.. ఏ సమస్యలు రావొచ్చు?