Accident: ఫ్లైఓవర్‌కు ఢీకొన్న బస్సు.. 12 మంది దుర్మరణం

by Mahesh Kanagandla |
Accident: ఫ్లైఓవర్‌కు ఢీకొన్న బస్సు.. 12 మంది దుర్మరణం
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్తాన్(Rajasthan) సికర్ జిల్లాలో మంగళవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) చోటుచేసుకుంది. వేగంగా వెళ్లుతున్న ఓ ప్రైవేటు బస్సు ఫ్లైఓవర్‌(Flyover)ను ఢీకొంది. ఈ ప్రమాదంలో 12 మంది మరణించగా, 40 మంది గాయపడ్డారు. సలాసర్ నుంచి వస్తున్న బస్సు సికర్ జిల్లా లక్ష్మణ్‌గడ్ చేరుకున్న తర్వాత ఫ్లైఓవర్ వింగ్ వాల్‌ను ఢీకొంది.

ప్రయాణికులతో స్పీడ్‌గా వెళ్లుతున్న బస్సు ఒక వైపు టర్న్ తీసుకుంటూ ఉండగా అదుపుతప్పినట్టు భావిస్తున్నారు. బస్సు కుడిభాగం నుజ్జునుజ్జయింది. డ్రైవర్ స్పాట్‌లోనే మరణించాడు. బస్సులో చిక్కుకున్న ప్రయాణికులను వెలికితీయడానికి క్రేన్‌ సహకారం తీసుకున్నారు. లక్ష్మణ్‌గడ్‌లోనే ఏడుగురు మరణించారని, ఎస్కే హాస్పిటల్‌కు 37 మంది పేషెంట్లను తీసుకురాగా.. అందులో ఇద్దరు అప్పటికే మరణించారని, మరో ముగ్గురు చికిత్స పొందుతుండగా చనిపోయారని హాస్పిటల్ సూపరింటెండెంట్ మహేంద్ర కిచాడ్ వివరించారు. ప్రయాణికులు స్థానికులేనని, వారి కుటుంబాలకు సమాచారం అందించామని ఐజీపీ సత్యేంద్ర సింగ్ వివరించారు. ఈ ఘటనపై సీఎం భజన్‌లాల్ శర్మ దిగ్భ్రాంతి వ్యక్తం చేయగా.. పీఎం ప్రధాని మోడీ పరిహారం ప్రకటించారు. మరణించిన ప్రయాణికుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు పరిహారమిస్తామని ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed