మణిపూర్‌లో జిరిబామ్‌లో ఎన్‌కౌంటర్‌.. 11 మంది ఉగ్రవాదులు హతం

by Mahesh |
మణిపూర్‌లో జిరిబామ్‌లో ఎన్‌కౌంటర్‌.. 11 మంది ఉగ్రవాదులు హతం
X

దిశ, వెబ్‌డెస్క్: మణిపూర్‌(Manipur)లో మరోసారి కాల్పుల మోత జరిగింది. గతంలో చెలరేగిన అల్లర్ల కారణంగా.. రణరంగంగా మారిన ఆ రాష్ట్రం మరోసారి వార్తల్లోకి ఎక్కుతుంది. గత రెండు వారాలుగా ఇరు వర్గాల మధ్య నిత్యం దాడులు జరగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర బలగాలు గస్తీ కాస్తున్నాయి. ఈ క్రమంలో సోమవారం జిరిబామ్ జిల్లాలో గస్తీ కాస్తున్న సీఆర్పీఎఫ్ క్యాంపు పై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌(encounter)లో ఒక సీఆర్పీఎఫ్ జవాన్ కూడా గాయపడ్డాడు. అయితే సీఆర్పీఎఫ్(CRPF) అధికారులు జరిపిన దాడిలో.. 11 మంది ఉగ్రవాదులు హతం అయినట్లు అధికారులు ప్రకటించారు. అలాగే ఉగ్రవాదుల దాడిలో గాయపడిని జవాన్‌ను అతడిని విమానంలో ఆసుపత్రికి తరలించారు. గత సంవత్సరం మే నుండి మణిపూర్‌లోని ఇంఫాల్‌కు చెందిన మెయిటీస్, పక్కనే ఉన్న కొండల ఆధారిత కుకీల మధ్య జాతి హింస కొనసాగుతుంది. ఇందులో ఇప్పటి వరకు 200 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.

కాగా, జిల్లాలోని బోరోబెక్రా సబ్‌డివిజన్‌లో ఉన్న పలు దుకాణాలను సాయుధ ఉగ్రవాదులు( terrorists) తగులబెట్టారు. మిలిటెంట్లు మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో బోరోబెక్రా పోలీస్ స్టేషన్ వైపు పలు రౌండ్లు కాల్పులు జరిపి జకురాడోర్ కరోంగ్ వైపు వెళ్లి దహనానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం, మణిపూర్‌లోని ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో పొలాల్లో పనిచేస్తున్న ఒక రైతు సమీపంలోని కొండపై స్థానాల నుంచి ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో గాయపడ్డాడు. ఇంఫాల్ లోయలో పొలాల్లో పని చేస్తున్న రైతులపై కొండలపైకి చెందిన ఉగ్రవాదులు దాడులు చేయడం ఇది వరుసగా మూడో రోజు. భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని ఎదురు కాల్పులు జరపడంతో కొద్దిసేపు ఎదురుకాల్పులు జరిగాయి. గాయపడిన రైతును చికిత్స కోసం యైంగాంగ్‌పోక్పి పిహెచ్‌సికి తీసుకెళ్లగా, ప్రస్తుతం అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. అలాగే మణిపూర్‌లోని హిల్ అండ్ వ్యాలీ జిల్లాల్లో జరిపిన సోదాల్లో భద్రతా దళాలు అనేక ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఐఇడిలను స్వాధీనం చేసుకున్నాయని అస్సాం రైఫిల్స్ ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Next Story