- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పంజాబ్ లుథియానాలో ఘోరం.. 11 మంది మృతి
దిశ, డైనమిక్ బ్యూరో: పంజాబ్‌లోని లుథియానాలో గ్యాస్ లీకై ఇద్దరు చిన్నారులు సహా 11 మంది మృతి చెందారు. గియాస్‌పురా ప్రాంతం గోయల్ మిల్క్ ప్లాంట్‌లో ఈ రోజు ఉదయం 7.15 గంటల సమయంలో గ్యాస్ లీకేజీని గుర్తించారు. శీతల పానీయాల దుకాణం, కిరాణా దుకాణం, మెడికల్ క్లినిక్ సహా వివిధ సంస్థలతో కూడిన బ్లాక్ నుంచి గ్యాస్ లీకైంది. దీంతో 300 మీటర్ల పరిధిలోని కార్మికులు, ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతసేపటికి అసలు ఊపిరాడకపోవడంతో తొలుత 9 మంది మృతి చెందగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. వీరిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఇంకా ఆరుగురు వరకు అస్వస్థతకు గురయ్యారు. వీరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలియడంతో ఎన్డీఆర్ బృందం సహాయ చర్యలు అందించింది. ప్రత్యేక వైద్య బృందాలు పరిస్థితులను సమీక్షించాయి.
డిప్యూటీ కమిషనర్ సురభి మాలిక్ ఏమన్నారంటే..
గ్యాక్ లీకైన ప్లాంట్‌ను లూథియానా డిప్యూటీ కమిషనర్ సురభి మాలిక్ పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ లీక్ వెనుక గ్యాస్ కాలుష్యమే కారణం కావొచ్చాన్నారు. బహుశా మ్యాన్ హోల్స్‌లో మీథేన్‌తో ఏదైనా రసాయన చర్య జరిగి ఉండొచ్చని చెప్పారు. అసలు ఏం జరిగిందనది త్వరలోనే తెలుసుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు లూథియానా వెస్ట్ సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ స్వాతి తెలిపారు. ఈ సంఘటనకు గ్యాస్ లీకైనట్లు ధృవీకరించారు.