Jammu and Kashmir: కుల్గాం జిల్లాలో ఆకస్మిక వరదలు.. ఒకరు మృతి

by Shamantha N |
Jammu and Kashmir: కుల్గాం జిల్లాలో ఆకస్మిక వరదలు.. ఒకరు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో భారీ వర్షాల వల్ల అకస్మాత్తుగా వరదలు వచ్చాయి. వరదల వల్ల ఒకరు చనిపోగా.. ముగ్గురికి గాయాలయ్యాయి. గురువారం తెల్లవారుజామున కుల్గాం జిల్లాలోని దమ్హాల్ హంజిపోరా ప్రాంతంలో అకస్మాత్తుగా వరదలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఆ ప్రాంతంలో అధికారులు రెస్క్యూ ఆపరేషన్‌లు చేపట్టారు. సహాయకచర్యలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఆగస్టు ప్రారంభంలోనూ జమ్ముకశ్మీర్ లోని గందర్ బల్ జిల్లాలో అకస్మాత్తుగా వరదలు పోటెత్తాయి. దీంతో రహదారి దెబ్బతింది. శ్రీనగర్- లేహ్ జాతీయ రహదారిని మూసివేశారు. గందర్‌బాల్ జిల్లాలోని కచెర్వాన్ వద్ద రోడ్డు దెబ్బతింది. దీంతో, తదుపరి నోటీసులు వచ్చేవరకు శ్రీనగర్-లేహ్ రహదారిని మూసివేస్తామని అధికారులు పేర్కొన్నారు. ఆ రహదారి గుండా రాకపోకలు నిలిపివేశారు.

Advertisement

Next Story