- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ముందు 50 కోట్లు డిపాజిట్ చేయండి: ఎల్జీ పాలిమర్స్‌కి ఎన్జీటీ ఆదేశం
దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని గోపాలపట్నం దగ్గర్లోని ఆర్‌ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకైన ఘటనపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ (ఎన్జీటీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్యాస్ లీకేజీ కారణంగా జరిగిన నష్టానికి గానూ వెంటనే ప్రాథమికంగా 50 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాల్సిందిగా ఎల్‌జీ పాలిమర్స్ ఇండియా సంస్థకు నోటీసులు జారీ చేసింది.
దుర్ఘటనకు కారణమైన ఎల్జీ పాలిమర్స్ సంస్థకు మాత్రమే కాకుండా కేంద్ర పర్యావరణ, అటవీ శాఖలకు, కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ)కి కూడా ఎన్జీటీ నోటీసులు జారీ చేసి, వెంటనే చోటుచేసుకున్న విషాదంపై సమాధానం చెప్పాలని ఆదేశించింది. కాగా, ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు కాగా, జాతీయ మానవ హక్కుల కమిటీ నోటీసులు జారీ చేసింది. మరోవైపు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, వివరణ కోరింది. ఈ క్రమంలో గ్యాస్ లీకేజీ, పశు, పక్షులు, చెట్లు కూడా నాశనం కావడంతో పాటు 12 మంది ప్రాణాలు కోల్పోవడంపై వివరణ కోరింది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్యాస్ లీకేజీ ఘటనపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ అధ్యక్షతన ఈ కమిటీ విచారణ జరిపి నివేదికను అందజేయనుంది. ఈ కమిటీలో సభ్యుడిగా విశాఖ కలెక్టర్ వినయ్ చంద్ కూడా ఉండడం విశేషం.
tags: lg polymers, ngt, cpcb,gas leak issue