అయస్కాంతంలా మారిన వ్యక్తి శరీరం.. వ్యాక్సినే కారణమా..?

by Anukaran |   ( Updated:2023-05-19 12:20:16.0  )
nasik man magnet
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇక కరోనా కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతునం విషయం తెలిసిందే. అయితే, కరోనాను కట్టడి చేయడానికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గమని ప్రభుత్వాలు, వైద్యులు తెలుపుతున్నారు. ప్రపంచంలోని పలు దేశాల్లో ఇప్పటికే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మొదలైంది. మన దేశంలో కూడా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇకపోతే వ్యాక్సిన్ వేయించుకున్న మొదటి వారం రోజులు జ్వరం, ఒళ్లునొప్పులు ఉంటాయని వైద్యులు తెలుపుతున్నారు. అయితే నాసిక్ కి చెందిన ఒక వ్యక్తికీ మాత్రం వ్యాక్సిన్ వేయించుకున్నాక శరీరం మొత్తం ఆయస్కాంతంలా మారిందంట. ఇంట్లో ఉన్న స్పూన్లు, ప్లేట్లు, నాణేలు అతడి శరీరానికి అయస్కాంతానికి అతుకున్నట్లు అంటుకుంటున్నాయట. దానికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

నాసిక్ కి చెందిన 71 ఏళ్ల అరవింద్‌ సోనార్‌ అనే వ్యక్తి ఇటీవల దగ్గర్లోని ఆసుపత్రిలో కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోస్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న రెండు రోజుల తరువాత ఆయన శరీరం అయస్కాంతంలా మారిపోయింది. అతణ్ని శరీరం ఇనుప వస్తువులను, కాయిన్స్‌ను, చెంచాలను అయస్కాంతంలాగా ఆకర్షించుకుంటుంది. ఈ వీడియోను ఆయన సోషల్ మీడియా లో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది.ఈ విషయంపై జిల్లా మెడికల్‌ అధికారులు స్పందించారు. సోనార్ తో మాట్లాడి రక్త నమూనాలు తీసుకొని నివేదికను ప్రభుత్వానికి పంపించారు. ఇదిలా ఉండగా.. ఈ విషయంపై సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) తన వెబ్‌సైట్‌లో వ్యాక్సిన్‌ను తీసుకున్న వారి శరీరం ఎలాంటి అయస్కాంత పదార్థాలుగా మారదని, కరోనా టీకా తీసుకుంటే మనిషి శరీరం అయస్కాంతంలా మారుతుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పింది.

Advertisement

Next Story

Most Viewed