- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అవినీతి ఆరోపణలు.. నార్సింగి సీఐ, ఎస్ఐపై సస్సెన్షన్ వేటు
దిశ, గండిపేట్: భూ వివాదాలు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో నార్సింగి సీఐ గంగాధర్, ఎస్ లక్షణ్‌పై సస్పెన్షన్ వేటుపడింది. వీరిని సస్పెండ్ చేస్తూ ఆదివారం సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే.. కొల్లూరు, జన్వాడ గ్రామాల సరిహద్దు భూ వివాదంలో తలదూర్చి సెటిల్ మెంట్లకు పాల్పడినట్లు నిర్ధారణ కావడంతో ఇద్దరిని విధులను నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొనారు.
గతంలోనూ వీరిద్దరు భూ వివాదాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్లు చేసినట్లు విచారణలో తేలినట్లు తెలిసింది. నార్సింగి సీఐ గంగాధర్‌పై ఉన్న పలు ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నార్సింగి మాజీ ఎంపీటీసీ సాయిరామ్ ముదిరాజ్, కుటుంబ సభ్యులను భూ వివాదంలో ఇబ్బందులకు గురి చేశారని గతంలో తీన్మార్ మల్లన్నకు సైతం ఫిర్యాదు చేశారు. ఇలాంటి సంఘటన నేపథ్యంలో సీఐ, ఎస్ఐపై వేటు పడటంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.