‘గాలి మాటలు ఆపి స్త్రీలను రక్షించు జగన్’

by srinivas |
‘గాలి మాటలు ఆపి స్త్రీలను రక్షించు జగన్’
X

దిశ, వెబ్‌డెస్క్: లేని చట్టాల పేర్లు చెబుతూ ఎంత కాలం మహిళల్ని మోసం చేస్తారు జగన్ అంటూ టీడీపీ నేత నారా లోకేశ్ ప్రశ్నించారు. పబ్లిసిటీ పిచ్చి తప్ప మహిళల రక్షణ మీకు పట్టదా అంటూ ఆయన నిలదీశారు. ‘ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి ఇంకెంత మంది బలైపోవాలి? రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. NCRB గణాంకాల ప్రకారం ఏపీలో రోజుకి 3 అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. మృగాళ్లు రెచ్చిపోయి చిన్నారులను చిదిమేస్తున్నారు. విశాఖలో బంగారు భవిష్యత్తు ఉన్న వరలక్ష్మిని మృగాడు బలి తీసుకున్నాడు. ఈ ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం జరగకముందే చిత్తూరు జిల్లాలో పెద్ద పంజాని మండలం, రాయల్ పేటలో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి తెగబడ్డారు. గాలి మాటలు చెప్పడం ఆపి మహిళలకు రక్షణ కల్పించండి జగన్ రెడ్డి అంటూ నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story