బీఫ్ ఫెస్టివల్ కేసులో రాజాసింగ్‌కు ఏడాది జైలు

by Anukaran |   ( Updated:2021-01-29 06:54:56.0  )
బీఫ్ ఫెస్టివల్ కేసులో రాజాసింగ్‌కు ఏడాది జైలు
X

దిశ, వెబ్‌డెస్క్ : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. 2016లో ఓయూలో నిర్వహించిన బీఫ్ ఫెస్టివల్‌పై ఆయన వివాదాస్పద కామెంట్స్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ నిర్వహిస్తే.. మరో దాద్రి అవుతుందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ పై సెక్షన్ 295-ఎ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ కేసుపై శుక్రవారం నాంపల్లి కోర్టు విచారణ జరిపింది. వాదోపవాదాల అనంతరం ఐదేళ్ల తర్వాత ఆయనకు ఏడాది జైలుశిక్ష విధిస్తూ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. తీర్పు వెలువడిన అనంతరం రాజాసింగ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా, ఈ తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తానని ఎమ్మెల్యే తెలిపారు.

Advertisement

Next Story