- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
రాష్ట్రంలో కొత్త పెన్షన్లు ఎప్పుడంటే?.. కీలక అప్‌డేట్!

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా ముందుకెళ్తుంది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన పలు హామీలను అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన నెల నుంచే పెన్షన్లను పెంచి ఇంటింటి పంపిణీ చేస్తోంది. ఈ తరుణంలో రాష్ట్రంలోని అర్హులైన వారు కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఎప్పటి నుంచే ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం(AP Government) కొత్త పెన్షన్ల మంజూరు పై దృష్టి సారించింది. కొత్త పింఛన్ల అంశంపై ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వారంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమై తుది నివేదికను సిద్ధం చేయనుంది.
దాన్ని పరిశీలించిన అనంతరం జూలైలో కొత్త పెన్షన్లను(new pensions) పంపిణీ(Distribution) చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కొత్త పెన్షన్ లకు సంబంధించి అన్ని కేటగిరీలకు కలిపి దాదాపు 6 లక్షల దరఖాస్తులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఏపీ(Andhra Pradesh)లో 63.32 లక్షల మందికి పింఛన్లు అందిస్తున్నారు. ఈ క్రమంలో పెన్షన్ల కోసం రూ.2,722 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ భరోసా పథకం కొత్త పింఛన్ల వల్ల నెలకు రూ.250 కోట్ల అదనపు భారం పడుతుందని అంచనా. ఇదిలా ఉంటే.. కొత్త పెన్షన్ల కోసం జులైలో దరఖాస్తులు(Applications) స్వీకరించి.. ఆగష్టు నుంచి పింఛన్‌లు ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే దాదాపు 90 వేల మందికి స్పౌజ్ పింఛన్లను జూన్ 1 నుంచి అందించనున్నట్లు సమాచారం. అయితే ఈ సమాచారం పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.