- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిండు ప్రాణం కాపాడిన నల్లగొండ పోలీసులు
దిశ, వెబ్‌డెస్క్: నల్లగొండ పోలీసులు నిండుప్రాణం కాపాడారు. ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని అడ్డుకున్నారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు సీహెచ్ సత్యనారాయణ, సురేష్ విధి నిర్వాహణలో భాగంగా పట్టనంలోని సాగర్‌రోడ్‌లో గస్తీ కాస్తున్నారు. అదే సమయంలో శంకర్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకోబోతున్నాడని డయల్ 100కి కాల్ వచ్చింది. దీంతో వారు వెంటనే స్పందించి, కేవలం నాలుగు నిమిషాల్లోనే ఆ వ్యక్తి లోకేషన్‌ను తెలుసుకుని అక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే ఉరి వేసుకున్న అతడిని ఉరి నుంచి కాపాడారు. అనంతరం స్పృహ తప్పిన సదరు వ్యక్తిని అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం ఆ వ్యక్తికి మనోధైర్యం నింపి అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా, విధి నిర్వహణలో భాగంగా వెంటనే స్పందించి, వ్యక్తి ప్రాణాలను కాపాడిన పోలీసులను సీఐ నిగిడాల సురేష్ అభినందించారు.