10 వేల మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తాం..

by Shyam |   ( Updated:2020-08-17 08:05:18.0  )
10 వేల మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తాం..
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: వినాయక చవితి పండుగ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులను పూజించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. జిల్లా యంత్రాంగం తరపున జిల్లాలోని ఏడు మున్సిపల్ పట్టణాలలో 10 వేల ఉచిత మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ మాట్లాడుతూ.. వినాయక చవితి సందర్భంగా పర్యావరణ హిత మట్టితో తయారు చేసిన విగ్రహాలను ఏడు మున్సిపాలిటీలలో జిల్లా యంత్రాంగం తరపున 10,000 మట్టి విగ్రహాలు పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.

నల్గొండ మున్సిపాలిటీలో 3000, మిర్యాలగూడ మున్సిపాలిటీలో 2000 విగ్రహాలు, దేవరకొండ, చండూరు, నందికొండ, చిట్యాల, హాలియా మున్సిపాలిటీ లలో ఒక్కొక్క మున్సిపాలిటీ లో 1000 చొప్పున మట్టి విగ్రహాలు ఉచితంగా జిల్లా యంత్రాంగం తరపున మున్సిపల్ కమిషనర్‌ల ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. మట్టి విగ్రహాలు వాడటం వలన చేతి వృత్తుల వారికి పని కల్పించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడిన వారవుతారన్నారు.

ప్లాస్టర్ ఆప్ ప్యారిస్‌తో తయారు చేసిన విగ్రహాలు తీవ్ర జల కాలుష్యం పెరిగి మానవాళికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అన్నారు. పర్యావరణ హితానికి రసాయనాలతో చేసిన విగ్రహాలను తగ్గించి, మట్టి విగ్రహాలు ప్రోత్సాహించేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో వుందని అన్నారు. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వినాయక మండపాలకు అనుమతి లేదని, గణేష్ వుత్సవ నిర్వాహకులు, ప్రజలు సహకరించాలని, వినాయక చవితి పండుగను ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ఇండ్లలోనే పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ ఈ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story