- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రజాదరణ కోల్పోయిన కేసీఆర్‌కు సోయి తప్పింది: నాగం జనార్దన్
దిశ, నాగర్‌కర్నూల్: ఉద్యమకారుల త్యాగ ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో అడ్డగోలుగా దోపిడీ చేసి, అక్రమంగా లక్షల కోట్లను వెనకేసుకున్న కేసీఆర్ ప్రజాదరణ కోల్పోతుండడంతో.. సోయి తప్పి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. మంగళవారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో తల్లడిల్లుతోందన్నారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలు తెలిసిన బీజేపీ ఎందుకు మౌనంగా ఉంటుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కోత దశలో ఉన్న వరిని కోయకుండా.. కొనుగోళ్ల కోసం రైతులు ఎదురుచూడటం దారుణమన్నారు. ప్రభుత్వాల మీద నమ్మకం లేక.. రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారని నాగం గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు చేయకుండా టీఆర్ఎస్-బీజేపీలు ఎందుకు ధర్నా చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ త్వరలోనే రైతు భరోసా యాత్ర చేపడుతోందన్నారు. ప్రభుత్వ అవినీతి, కేసీఆర్ కూడబెట్టుకున్న లక్షల కోట్లను ప్రజలకు అప్పగించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తామంటూ నాగం జనార్దన్ ధీమా వ్యక్తం చేశారు.