- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవితం ప్రకృతికి అంకితం.. నేచర్ సంరక్షకుడికి ‘గ్రీన్’ ఆస్కార్
దిశ, ఫీచర్స్ : ప్రకృతికి మనుషులు అవసరం లేదు. కానీ మనిషికి ప్రకృతి కావాలి. ఏదో ఉత్పాతం సంభవించి మనుషులు అంతరించిపోతే ప్రకృతికి వచ్చినా నష్టమేమి ఉండదు. కానీ ప్రకృతిలో భాగమైన సీతాకోకచిలుకలు, తేనెటీగలు, వృక్షాలు వీటిలో ఏవీ అంతరించిన, ఆ ప్రభావంతో మానవ జాతి కూడా అతి తక్కువ కాలంలోనే కాలగర్భంలో కలిసిపోతుందని తెలిసిన విషయమే. అందుకే ప్రకృతిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత మానవజాతికి ఉంది. ఈ క్రమంలోనే నాగాలాండ్‌కు చెందిన పర్యావరణవేత్త ‘నుక్లు ఫోమ్’ పర్యావరణానికి తిరిగి జీవం పోస్తూ, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. అడవుల్ని రక్తిస్తూ.. అరుదైన అముర్ ఫాల్కన్ జనాభాను పెంచుతున్న నుక్లు ఫోమ్ చేస్తున్న కృషికిగానూ ‘గ్రీన్ ఆస్కార్’ వరించింది.
పసివయసులో తన తాతతో కలిసి నాగాలాండ్ అడవుల్లో తిరిగిన నుక్లు, చిన్నప్పటి నుంచే ప్రకృతితో ప్రేమానుబంధాన్ని ఏర్పరుచుకున్నాడు. అరణ్యంలో తాత చేయి పట్టుకుని వివిధ జాతుల పక్షులను గుర్తించడమే కాకుడా.. వాటికి పేరుపెట్టడాన్ని నుక్లు ఇష్టపడేవాడు. అతడు టీనేజ్‌కి వచ్చే సరికి ఎన్నో కారణాల వల్ల పక్షుల జనాభా గణనీయంగా తగ్గిపోవడంతో నుక్లు నిరాశపడ్డాడు. కానీ అడవికి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి ప్రయత్నించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే తన యుక్తవయస్సులో ఎక్కువ భాగం అరుదైన అముర్ ఫాల్కన్ జనాభాను పెంచడానికి, వేలాది చెట్లను నాటడానికి వెచ్చించాడు. అంతేకాదు వేటను నివారించడానికి ప్రజల్లో అవగాహన తీసుకొచ్చాడు. ఈ నేపథ్యంలోనే 1,000 హెక్టార్ల సారవంతమైన భూమిని తోటలను, ఫాల్కన్లను పెంచడానికి అంకితం చేశాడు. ‘లెమ్సాచెన్లోక్’ సంస్థను స్థాపించి మరిన్ని ప్రకృతి సంరక్షణ చర్యలు చేపట్టాడు. అముర్ ఫాల్కన్‌లను పాపులేషన్ పెంచేందుకు నుక్లు చేసిన కృషి పదేళ్లకు ఫలించింది. 2010లో 50,000 ఉన్న వాటి జనాభా 2019లో 20 రెట్లు పెరిగి మిలియన్‌కు చేరుకుంది.
ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందని దేశాలలో పరిరక్షణ పనులు చేస్తున్న వ్యక్తులకు ‘వైట్లీ’ అవార్డు అందిస్తారు. గ్రీన్ ఆస్కార్‌గా పిలిచే ఈ పురస్కారం ఈ ఏడాది నుక్లు గెలుచుకున్నాడు. నాగాలాండ్‌లో అతడు చేస్తున్న పరిరక్షణ చర్యలకు గానూ ఈ అవార్డు రాగా, గ్రహీతకు వైట్లీ ఫండ్ ఫర్ నేచర్ నిధుల నుంచి వారి పనికి మద్దతుగా సుమారు రూ.40 లక్షలు అందుకుంటారు. ఈ నిధులను ‘బయోడైవర్శిటీ పీస్ కారిడార్’ (బిపిసి) కోసం నుక్లు ఉపయోగించనున్నాడు. నుక్లు ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నందుకు నాగాలాండ్ ముఖ్యమంత్రి ‘నీఫియు రియో’ ఇటీవల అతడిని ట్విట్టర్ ద్వారా అభినందించారు. పూర్ణిమ బార్మాన్, అపరాజిత దత్తా, M.D. మధుసూదన్, రోములస్ విటేకర్ ఇప్పటివరకు గ్రీన్ ఆస్కార్ అందుకున్న భారతీయులు.
‘యాయోంగిమ్చెన్, అలయోంగ్, సాంగ్లు ఈ మూడు గ్రామాల ప్రజలను 2007లో 800 హెక్టార్ల సాధారణ భూమిని కేటాయించాలని నేను ఒప్పించాను. ఈ భూమిపై వేట, నిర్మాణం ఏదైనా సహజ వనరులను వెలికి తీయడం నిషేధించబడింది. అది ఇప్పుడు 1,200 హెక్టార్లకు పెరిగింది. ఫాల్కన్ జనాభా కూడా విపరీతంగా పెరిగింది. మేము ఇప్పుడు ఒకేసారి 400-500 హార్న్‌బిల్స్‌ను గుర్తించగలుగుతున్నాము. అయితే అవి అంతకుముందు ప్రమాదంలో ఉన్నాయి. గుడ్లగూబలు, బార్క్ జింకలు, గ్రీన్ ఎమరాల్డ్, ముంగూస్ వంటి ఇతర అడవి జంతువులను కూడా రక్షిత ప్రాంతాలలో చూడవచ్చు. మా లెమ్సాచెన్లోక్ కృషిని ఐక్యరాజ్యసమితి కూడా గుర్తించింది. 2018లో ఇండియా బయోడైవర్శిటీ అవార్డుతో పాటు, 2021లో గవర్నర్ గోల్డ్ మెడల్ అవార్డును పొందింది. ప్రజలను వేటాడటం నుంచి తప్పించి పంట సాగు, చేపలు పట్టడం వంటి ప్రత్యామ్నాయ వృత్తులకు మారడానికి సహాయం చేస్తుంది. ఆదాయాన్ని సంపాదించడానికి పర్యావరణ పర్యాటక కార్యకలాపాలను కూడా ప్రవేశపెడుతోంది. వర్షపునీటిని ఆదా చేయడానికి, భూగర్భజల పట్టికలను పెంచడానికి నీటి నిల్వలను కూడా నిర్మిస్తున్నాం. ఈ ప్రయత్నాలన్నింటి వెనుకున్న ప్రధాన ఉద్దేశ్యం.. పశుపక్ష్యాదులతో, ప్రకృతితో కలిసి జీవించడమే’
“నాగాలాండ్‌లో అటవీ లేదా నదీ భూమి యాజమాన్యం ఒక వ్యక్తి లేదా వంశానికి చెందింది. కాబట్టి పరిరక్షణ కోసం భూమిని కేటాయించమని సంఘాలను కోరడం అతిపెద్ద సవాలు. కలప, అటవీ ఉత్పత్తులు, జంతువులను అమ్మడం ద్వారా వారు డబ్బు సంపాదిస్తారు. మరో భయంకరమైన విషయం ఏమిటంటే అధిక సంఖ్యలో నగదు పంటలు వేయడం, స్వదేశీ మొక్కల క్షీణత, రసాయనాల వినియోగం వంటివి భూమి సంతానోత్పత్తిని పూర్తిగా దిగజార్చాయి. ఈ సమస్యలన్నింటినీ ఒకేసారి పరిష్కరించుకోవలసి వచ్చింది. ఒక్క సమస్య అలాగే కొనసాగినా మా ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యేదికాదు’.
– డాక్టర్ లిమా, సంస్థ సభ్యుడు