- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేప్ కేసులో నటుడు అరెస్ట్.. సపోర్ట్ చేసిన హీరోయిన్
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ సీరియల్ నటుడు పెర్ల్ వి పూరి మైనర్ బాలిక కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే . అవకాశాలు ఇప్పిస్తానని బాలికకు మాయమాటలు చెప్పి పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మైనర్ బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పటికే నటుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ ల కింద అతడిని అరెస్ట్ చేసినట్లుగా ముంబయి పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే పెర్ల్ వి పూరి అరెస్ట్ ని ఖండిస్తూ పలువురు టీవీ నటీనటులు సోషల్ మీడియా లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగులో ‘నువ్వు నేను’ చిత్రంతో పరిచయమై మెప్పించిన హీరోయిన్ అనితా కూడా అతనికి మద్దతు ఇచ్చింది. సోషల్ మీడియాలో పెర్ల్ వి పూరి తో కలిసి దిగిన ఒక ఫోటోను షేర్ చేస్తూ పెర్ల్ వి “పూరి పై పెట్టిన కేసు నాన్సెన్స్ అని, అతని గురించి తనకు బాగా తెలుసని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా వారు చెప్పేవన్నీ అబద్ధాలని, ఈ కేసులో నిజానిజాలు బయటికి రావాంటూ” ఆమె డిమాండ్ చేసింది. ఇక నెట్టింట్లో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. రేప్ కేసులో అరెస్ట్ అయిన నటుడికి సపోర్ట్ ఇస్తున్న అనితపై పలువురు నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక అనిత, పెర్ల్ వి పూరి ‘నాగిని’ సిరీస్ లో కలిసి నటించారు. తెలుగులోనూ ఈ నటుడికి మంచి ఫాలోయింగ్ ఉంది.