N-95 మాస్కులపై కొత్త మార్గదర్శకాలు

by Anukaran |   ( Updated:2020-07-20 10:53:47.0  )
N-95 మాస్కులపై కొత్త మార్గదర్శకాలు
X

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ బారి నుంచి తప్పించుకోవాలంటే, నిత్యం మొహానికి మాస్కు, చేతులకు శానిటైజర్, ఇతరులకు మధ్య సామాజిక దూరం పాటించడం తప్పనిసరి పరిస్థితిగా మారింది. అయితే ఈ మస్కుల వినియోగంపై డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ (డీజీహెచ్ఎస్) సోమవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. అన్ని రాష్ట్రాల వైద్యాధికారులకు లేఖ రాశారు. వాల్వ్ కల్గిన ఎన్-95 మాస్కులతో ఉపయోగం లేదని తేల్చి చెప్పారు. వ్యక్తి నోటి నుంచి బయటకు విడుదలయ్యే వైరస్‌ను అవి ఆపలేవని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తిని అడ్డుకునే చర్యలకు ఇదొక అవరోధం అని పేర్కొన్నారు. నోరు, ముక్కు పూర్తిగా మూసేసే మాస్కులను మాత్రమే వినియోగించాలని వెల్లడించారు. ఆ దిశగా అన్ని విభాగాలకు ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed