- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నా సినిమాల్లో ఆ సీన్స్ సితారకు నచ్చవు.. సూపర్ స్టార్ మహేష్ షాకింగ్ కామెంట్స్

దిశ, సినిమా : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. ‘సూపర్ స్టార్‌గా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కృష్టగారి అబ్బాయిగా సినీ రంగంలో ప్రవేశించటం నా అదృష్టం. ఆయన అభిమానులను సంతృప్తి పరచడం నాకు పెద్ద ఛాలెంజ్, అలాగే నాకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకోవాలి. ఇలాంటి ఛాలెంజ్‌లు నేను కెరీర్ బిగినింగ్‌లో చాలా ఎదుర్కొన్నాను. సమ్మర్ వెకేషన్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేశాను. చదువు పూర్తి కాగానే నాన్న సినిమాల్లోకి వచ్చేయ్ అన్నారు’ అని తెలిపారు మహేష్.
తన కొత్త సినిమా విడుదలైన వెంటనే ఇద్దరు పిల్లలు, భార్యతో కూర్చొని ఇంట్లో చూస్తానన్న ప్రిన్స్.. అది చాలా గొప్ప అనుభూతిని ఇస్తుందన్నారు. అలాగే తన సినిమాలు పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే భయం కూడా ఉంటుందని.. అందుకే ఆచితూచి ఎంచుకుంటానని తెలిపారు. తన సినిమాల్లో ఫైట్స్ వాళ్లకు అసలు నచ్చవని, ముఖ్యంగా సితార ఫైట్ సీన్స్ రాగానే బయటకు వెళ్లిపోతుందని వివరించారు.