పవన్ డిప్యూటీ CM కావడం ఏపీ ప్రజల దురదృష్టం.. MLC కవిత సంచలన వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
పవన్ డిప్యూటీ CM కావడం ఏపీ ప్రజల దురదృష్టం.. MLC కవిత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ(Jana sena Party) అధినేత పవన్ కల్యాణ్‌(Pawan Kalyan)పై బీఆర్ఎస్(BRS) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) హాట్ కామెంట్స్ చేశారు. ఇటీవల ఆమె ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ గురించి మాట్లాడారు. ‘పవన్ కల్యాణ్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన సీరియస్ పొలిటీషియన్ కాదు. ఆయన వ్యాఖ్యలను పెద్దగా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో పూర్తిగా వామపక్ష భావాజాలంతో ఉన్నట్లు కనిపించారు. చేగువేరాను ఆదర్శంగా తీసుకుంటున్నట్లు ప్రకటించారు. సీపీఐ, సీపీఐఎం పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. కంప్లీట్‌‌గా లెఫ్ట్ నుంచి రైట్‌కు వచ్చారు. బీజేపీ పక్కన చేరిన నాటి నుంచి హిందుత్వం మీద అతిభక్తి పెరిగిపోయింది. ఆయన చేసే ప్రకటనలు కూడా ఒకదానికొకటి సంబంధం ఉండవు.

రేపు తమిళనాడుకు వెళ్లి హిందీ ఇంపోజ్ చేయబోము అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. పార్టీ పెట్టిన 15 ఏళ్లకు ఎమ్మెల్యే అయ్యారు. వైసీపీ మినహా దాదాపు ఏపీలోని అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎం కావడం ఏపీ ప్రజల దురదృష్టం’ అని ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కొందరు పవన్ కల్యాణ్ అభిమానులు కవితపై విమర్శలు చేస్తుండగా.. బీఆర్ఎస్ నేతలు సమర్దిస్తున్నారు. ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటీ? అని యాంకర్ అడిగిన ప్రశ్నలకు కవిత పై విధంగా రియాక్ట్ అయ్యారు.



Next Story

Most Viewed