- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హుజురాబాద్ ఓటర్లు రాష్ట్రంలో పెను మార్పు తెస్తారు : మురళీధర్ రావు
దిశ, కరీంనగర్ సిటీ : ధనబలం, అధికార దుర్వినియోగానికి నమూనాగా హుజురాబాద్ ఉప ఎన్నిక నిలిచిందని బీజేపీ జాతీయ నేత, మధ్యప్రదేశ్ ఇంచార్జీ మురళీధర్ రావు అన్నారు. బుధవారం నగరంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. హుజురాబాద్ ఉప ఎన్నిక భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాలను ప్రభావం చేయబోతోందని తెలిపారు. రాబోయే రోజుల్లో ఉప ఎన్నికలకు ముందు.. ఉప ఎన్నిక తర్వాత అని ప్రజలు చర్చించుకునే అవకాశం కలుగుతుందన్నారు.
సీఎం కేసీఆర్ ఏడేళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేకపోవడంతో, టీఆర్ఎస్ వ్యతిరేక భావన పెరిగిందన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్ కూడా దక్కదని, రాబోయే రోజుల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకని దుస్థితి ఉండబోతుందని జోస్యం చెప్పారు. రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఘర్షణ వైఖరి అవలంభిస్తూ, కేంద్రంలో వంగి సలాములు కొడుతున్నాడని, కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను రాష్ట్రంలో తనకు అనుకూలంగా మలచుకుంటూ, బీజేపీపై దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
కుల రాజకీయాలకు బ్రాండ్‌గా మారిన టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో, కేంద్రంలో ప్రజలు బీజేపీని ఎంచుకుంటున్నారని స్పష్టం చేశారు. 18 ఏళ్లు కలిసిమెలిసి ఉన్న ఈటల రాజేందర్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అవాక్కులు, చెవాక్కులు పేలుతున్నాడంటే ఓటమి భయం పట్టుకుందని స్పష్టమవుతోందన్నారు. హుజురాబాద్ ప్రజల ఓట్లు రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తేబోతున్నాయని, ఈ అవకాశాన్ని అక్కడి ఓటర్లు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
గెలుపు కోసం చివరి ప్రయత్నంగా ఓటర్లను ప్రలోభాలకు, భయబ్రాంతులకు గురిచేసేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ పక్కా ప్రణాళికను రూపొందించుకున్నదని అన్నారు. దీని కోసం స్థానికేతర ప్రజాప్రతినిధులను వినియోగించుకోనున్నట్టు తెలిపారు. ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టి నేటి నుంచి ఈనెల 30వ తేదీ సాయంత్రం వరకు స్థానికేతరులను ఉప ఎన్నిక జరుగుతున్న గ్రామాల నుంచి పంపించి, ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓట్లు వేసే అవకాశం కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు కన్నెబోయిన ఓదెలు, హరి కుమార్ గౌడ్, బీజేవైఎం రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి పెండ్యాల సాయి కృష్ణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.