- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మున్సిపల్ సిబ్బంది అత్యుత్సాహం.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న కాంగ్రెస్ నేతలు
దిశ, తొర్రూర్: బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపేందుకు వివిధ పార్టీలు, కుల, విద్యార్థి, ప్రజా సంఘాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తొర్రూర్ మున్సిపల్ కేంద్రంలో మంత్రి దయాకర్ రావు ఫ్లెక్సీలకు ఎదురుగా పెద్ద చెరువు వద్ద ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను మున్సిపల్ సిబ్బంది అత్యుత్సాహంతో తొలగించారు. దీనిపై కాంగ్రెస్ నాయకులు, అక్కడికి వచ్చిన ప్రజలు ఎవరికోసం తొలగిస్తున్నారో, ఎవరి మెప్పు కోసం తొలగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పట్టణంలో తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే ఫ్లెక్సీల తొలగింపుపై అసహనం వ్యక్తం చేస్తూ.. ఎందుకు తొలగిస్తున్నారని మున్సిపల్ సిబ్బందిని ప్రశ్నించగా అనుమతి లేనందుకే తొలగించామని చెప్పారు.
మంత్రి మెప్పుకోసం అత్యుత్సాహం : బసనబోయిన వినోద్ కుమార్, కాంగ్రెస్ తొర్రూర్ పట్టణ ఉపాధ్యక్షుడు
తొర్రూర్ మున్సిపల్ సిబ్బంది మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మెప్పు పొందడం కోసం అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ తొర్రూర్ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ మండిపడ్డారు. పండుగ సందర్భంగా అన్నిచోట్లా ప్లెక్సీలు పెట్టారు, కానీ, కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలకు మాత్రమే అనుమతులను చూపించాలని, టీఆర్ఎస్ ప్లెక్సీలకు ఎలాంటి అనుమతులు లేకున్నా తొలగించడం లేదని మండిపడ్డారు. మంత్రికి అధికారులు కొమ్ము కాస్తున్నారని, బతుకమ్మ చెరువు వద్దకు వస్తున్న మంత్రికి ఎదురుగా ఉన్న ఫ్లెక్సీలను తొలగించడం సరైనది కాదని చెప్పారు. అధికారంలో ఉంటే వారి ఫ్లెక్సీలు మాత్రమే ఉండాలా? అని ప్రశ్నిస్తున్నారు.