ఆ షాట్స్ సంతృప్తిని ఇచ్చాయి : సూర్య

by Shyam |
ఆ షాట్స్ సంతృప్తిని ఇచ్చాయి : సూర్య
X

దిశ, వెబ్‌డెస్క్: అబుదాబిలో సూర్య కుమార్ యాదవ్ చెలరేగిపోయాడు. 43 బంతుల్లో 79 పరుగులు చేసి సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో ముంబై విజయం సాధించి, ప్లేఆఫ్స్‌లో స్థానం భర్తీ చేసుకుంది. కాగా అద్భుతంగా రాణించిన సూర్యకుమార్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘ఈ రోజు మ్యాచ్ ఎలాగైనా చివరి వరకు ఉండి గెలిపించాలని అనుకున్నాను. చాహల్, స్టెయిన్ బౌలింగ్‌లో ఆడిన షాట్స్ నాకు తృప్తిని ఇచ్చాయి. సీజన్ ప్రారంభం నుంచి రోహిత్ శర్మ, టీమ్ మేనేజ్‌మెంట్ నాకు ఇచ్చిన సహకారం కారణంగానే మంచి ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాను.’ సూర్యకుమార్ వెల్లడించారు.

Advertisement

Next Story