- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రేమ శాంతి ఐక్యతే క్రిస్మస్ సందేశం : ఎమ్మెల్యే సీతక్క
దిశ, మంగపేట: ప్రేమ శాంతి ఐక్యతలను చాటేదే క్రిస్మస్ పండుగని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ క్రిస్మస్ కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొని దుస్తులు పంపిణీ చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రేమ శాంతి ఐక్యతల సందేశమే క్రిస్మస్ అని అన్నారు. విశాలమైన భారతదేశంలో అన్ని కులాలు, మతాలు శాంతి ప్రేమ ఐక్యతతో ఉండి దేశ సౌభాగ్యాన్ని పెంపొందించాలన్నారు. దేశంలో జరుగుతున్న మత మార్పిడి వ్యవహారాలు సున్నితంగా ఇష్టపూర్తిగా జరిగితేనే అనుమతించాలని అన్నారు. బలవంతపు మత మార్పిడులకు పాల్పడి దేశంలో అశాంతిని ప్రేరేపించవద్దని కోరారు.
క్రిస్మస్ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న క్రిస్మస్ కిట్లను పేద క్రిస్టియన్లు వినియోగించుకోని పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీకాంత్ బెహరా, సొసైటీ చైర్మన్ తోట రమేష్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మైల జయరాం రెడ్డి, సంఘం నాయకులు ఆధం, దేవరాజు, తిమోతి, విజయరాజు, ఆంద్రయ్య, పీటర్, కృపానిధి, టైటస్, లూకస్ తదితరులు పాల్గొన్నారు.