మమ్మల్ని అద్దె అడగొద్దు ప్లీజ్..!

by Harish |
మమ్మల్ని అద్దె అడగొద్దు ప్లీజ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 తెచ్చిన కష్టం మరేదీ లేదేమో! ఏ దేశ వ్యవస్థ చూసినా లాక్‌డౌన్‌లే దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో దేశీయంగా గత పది రోజులుగా అన్ని రకాల పరిశ్రమలు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, మల్టిప్లెక్స్‌లతో సహా అనేక రకాల వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆయా సముదాయాల యజమానులకు సదరు వ్యాపార వర్గాలు ఒక అభ్యర్థన చేశాయి. దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్ వల్ల అన్ని రకాలుగా తాము నష్టాలను ఎదుర్కొంటున్నందున అద్దె, కామన్ ఏరియా మెయింటెనెన్స్‌లను అడగవద్దని, వాటికి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. లాక్‌డౌన్ అధికారికంగా ప్రకటించడానికి ముందు నుంచే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు తమ వ్యాపారాలను మూసేయాలని ఆదేశించాయని, వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఆదాయం కోల్పోయిన తమకు ఈ మినహాయింపు వర్తింపజేయాలని మల్టిప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అధికారిక లెక్కల ప్రకారం..దేశంలో మొత్తం 600 మల్టిప్లెక్స్‌లు, 2,900 స్క్రీన్లకు పైగా ఉన్నాయని అసోసియేషన్ వెల్లడించింది.

Tags: Multiplex Association, Cinema Halls, rent problems, coronavirus, covid-19

Advertisement

Next Story