- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మళ్లీ ఆసియా కుబేరుడిగా ముఖేశ్ అంబానీ!
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్: దేశీయ అతిపెద్ద సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ మరోసారి ఆసియా కుబేరుడిగా అగ్రస్థానానికి చేరారు. సుమారు రూ. 5.6 లక్షల కోట్ల నికర ఆస్తులతో ముఖేశ్ అంబానీ ఈ స్థానాన్ని దక్కించుకున్నారు. చైనాకు చెందిన బిలియనీర్ ఝాంగ్ షంషన్ రెండో స్థానంలో కొనసాగుతున్నట్టు బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకటించింది.
ఝాంగ్ షంషన్ గడిచిన వారం రోజుల వ్యవధిలో 22 బిలియన్ డాలర్ల విలువైన సంపదను నష్టపోయారని, ఈ కారణంగా ముఖేశ్ అంబానీ ఆసియా కుబేరుడి స్థానాన్ని తిరిగి సాధించారని బ్లూమ్‌బర్గ్ నివేదిక పేర్కొంది. గత రెండేళ్ల కాలంలో ముఖేష్ అంబానీ అలీబాబా గ్రూప్ అధినేత జాక్ మా తర్వాత అత్యధిక రోజులు ఆసియా కుబేరుడిగా ఉన్నారు. ప్రస్తుతం ఝాంగ్ షంషన్ సంపద విలువ 76.6 బిలియన్ డాలరుగా ఉందని బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది.
Advertisement
Next Story