- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసిన ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి
ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసిన ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి

X
దిశ, ముధోల్ : ముధోల్ నియోజకవర్గంలో ఇటీవల భారీ వర్షాలకు దెబ్బతిన్న పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని ముధోల్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి విన్నవించారు. సోమవారం ఉదయం ఎర్రబెల్లి దయాకర్ రావుని హైదరాబాద్ లోని తన నివాసంలో ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి కలిశారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో దెబ్బతిన్న రోడ్ల వివరాలను, అవసరమయ్యే నిధుల వివరాలను మంత్రికి అందజేశారు. అలాగే నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి ఎర్రబెల్లి అవసరమైన నిధులను మంజూరు చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట కుంటాల మండలం టీఆర్ఎస్ కన్వీనర్ పడకంటి దత్తు, నాయకులు ఉన్నారు.
Next Story