నిన్నటి నుండి జంగీపూర్‌లో అశాంతి వాతావరణం కనిపిస్తోంది: డీజీపీ రాజీవ్ కుమార్

by Mahesh |   ( Updated:2025-04-14 12:27:40.0  )
నిన్నటి నుండి జంగీపూర్‌లో అశాంతి వాతావరణం కనిపిస్తోంది: డీజీపీ రాజీవ్ కుమార్
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లు (Waqf Amendment Bill) ఆమోదం పొంది.. చట్టంగా మారిన విషయం తెలిసిందే. ఈ వక్ఫ్ సవరణ చట్టానికి (Waqf Amendment Act) వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున నిరసనలు మొదలయ్యాయి. ముక్యంగా ముస్లిం సమాజం అధికంగా ఉండే ప్రాంతాల్లో నిరసన అదుపుతప్పి మతపరమైన అల్లర్లు చెలరేగుతున్నాయి. దీంతో మమతా బెనర్జీ ప్రభుత్వంపై (Mamata Banerjee government) తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తున్నాయి. కాగా ఈ అల్లర్లపై ఈ రోజు పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ (Bengal DGP Rajiv Kumar) మీడియాతో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "నిన్నటి నుండి జంగీపూర్‌లో అశాంతి వాతావరణం (Unrest in Jangipur) కనిపిస్తోంది.

వక్ఫ్ చట్టం వ్యతిరేక నిరసనలు రూపాంతరం చెంది.. మతపరమైన అల్లర్లు (Religious riots) కూడా జరుగుతున్నాయి. తాము ఎలాంటి గూండాయిజాన్ని సహించబోమని. పరిస్థితిని మేము చాలా కఠినంగా ఎదుర్కొంటున్నాము. రాష్ట్ర ప్రజల ప్రాణాలను కాపాడటం మా బాధ్యత. గూండాయిజానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము. ఎవరూ పుకార్లు వ్యాప్తి చేయకూడదు. పుకార్లను పట్టించుకోకండి. పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి. హింస ప్రభావిత ప్రాంతాల్లో (Violence affected areas) సెక్షన్ 163 వర్తిస్తుంది. ప్రభుత్వ ఆస్తులకు నిప్పంటిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. ఈ నిరసనలను అదుపు చేసేందుకు.. తాము ప్రజల సహకారం కోరుతున్నాము, ఎలాంటి హింసను మేము సహించమని డీజీపీ రాజీవ్ కుమార్ మీడియా వేదికగా చెప్పుకొచ్చారు.


Advertisement
Next Story

Most Viewed