ఇంటర్మీడియట్ ఫలితాలు.. ఆ కాలేజీలో అందరూ ఫెయిల్

by Jakkula Mamatha |
ఇంటర్మీడియట్ ఫలితాలు.. ఆ కాలేజీలో అందరూ ఫెయిల్
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలను నేడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Minister nara Lokesh) వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో ఈ ఏడాది అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది అని మంత్రి తెలిపారు. అయితే.. తాజాగా విడుదల చేసిన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఓ కళాశాలలో అందరూ ఫెయిల్ అయ్యారు. వివరాల్లోకి వెళితే.. కడప జిల్లా(Kadapa District) కమలాపురం ప్రభుత్వ జూనియర్ కాలేజీ(Govt Junior College)లో 33 మంది ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు పరీక్షలు రాశారు.

ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులు అందరూ ఫెయిల్ అయినట్లు ప్రిన్సిపాల్ ఖాజా పర్వీన్ తెలిపారు. ఇక సెకండియర్‌లో 14 మంది పరీక్షలు రాస్తే ఇద్దరు మాత్రమే పాస్ అయినట్లు ప్రిన్సిపాల్ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల(Intermediate Supplementary Examinations) తేదీలను ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో అప్‌గ్రేడ్ చేసిన కాలేజీల్లోనే ఫెయిల్ పర్సంటేజ్ ఎక్కువ నమోదైనట్లు తెలుస్తోంది.



Next Story