సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న ధోనీ

by Shyam |
సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న ధోనీ
X

దిశ, స్పోర్ట్స్: టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మహీంద్ర సింగ్ ధోనీ రైతు అవతారం ఎత్తాడు. రాంచీలోని తన వ్యవసాయ క్షేత్రంలో సేంద్రీయ వ్యవసాయం ప్రారంభించాడు. ఏడెకరాల విస్తీర్ణంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో కొంత భాగంలో ఇల్లు కట్టుకోగా మిగిలిన భూమిలో సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాడు. తాజాగా ధోనీ ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గత ఏడాది వరల్డ్ కప్ నుంచి బ్యాట్ పట్టని ధోనీ, లాక్‌డౌన్‌కు ముందు చెన్నై వెళ్లి ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేశాడు. కానీ, ఐపీఎల్ అర్ధాంతరంగా వాయిదా పడటంతో తిరిగి ఇంటికి వచ్చి తన కుటుంబంతో గడుపుతున్నాడు. ధోనీ తీరిక వేళల్లో తన వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన పనులు చేస్తున్నాడు. అక్కడ ఏం పండించబోతున్నాడో మాత్రం తెలియరాలేదు.

Advertisement

Next Story