డిఫరెంట్‌గా ట్రై చేస్తా : మృణాల్

by Jakkula Samataha |
డిఫరెంట్‌గా ట్రై చేస్తా : మృణాల్
X

దిశ, వెబ్‌డెస్క్: స్మాల్ స్క్రీన్ నుంచి వచ్చిన మృణాల్ ఠాకూర్.. బిగ్ స్క్రీన్‌పై సూపర్ చాన్స్‌లు అందుకుంటోంది. చాలా తక్కువ కాలంలోనే స్టార్స్ పక్కన నటించే అవకాశం పొందిన భామ.. బుల్లితెర నుంచి వెండితెరకు తన జర్నీ అమేజింగ్‌‌గా అనిపిస్తోందని తెలిపింది. తొలి చిత్రం ‘లవ్ సోనియా’ తనలోని యాక్టింగ్ స్కిల్స్‌ను చూపించిందని.. ఇది మరిన్ని సినిమాలకు ఆడిషన్స్ చేసేందుకు సహాయపడిందని చెప్పింది. మనకు గాడ్ ఫాదర్ లేనప్పుడు నిరుత్సాహ పడకుండా ప్రయత్నిస్తే శక్తివంతంగా మారొచ్చని అభిప్రాయపడింది. మొదటగా సినిమాల్లోకి ప్రవేశించేందుకు భయపడినా, గట్స్‌తో ముందుకు కదిలానని చెప్పింది. స్క్రీన్ స్పేస్ కన్నా కూడా కథలపై ఎక్కువ దృష్టి పెడతానన్న మృణాల్.. ఏ దర్శకులు, నిర్మాతలతో పనిచేస్తున్నామనేది కూడా ముఖ్యమని చెప్పింది.

‘సూపర్ 30’లో హృతిక్ రోషన్‌తో జోడీ కట్టిన భామ.. చివరగా జాన్ అబ్రహాం ‘బట్లా హౌస్’లో చివరగా కనిపించింది. ప్రస్తుతం షాహిద్ కపూర్ తెలుగు రీమేక్ ‘జెర్సీ’ సినిమాలో నటిస్తున్న మృణాల్.. చండీగర్, డెహ్రాడూన్‌లో జరిగే షూటింగ్‌లో జాయిన్ కానుంది. ‘బట్లా హౌస్’ తర్వాత తనలో ఉన్న యాక్టర్‌ను ఆడియన్స్‌కు చూపించాలనుకున్నట్టు తెలిపిన భామ.. లాక్ డౌన్‌లో పొటెన్షియల్ ఉన్న స్క్రిప్ట్స్ విన్నానని, బ్రిలియంట్ ప్రాజెక్ట్‌లకు సైన్ చేశానని తెలిపింది. ‘కొన్ని మంచి సినిమాలు కూడా వదులుకున్నానన్న ఫీలింగ్ ఉన్నా.. హార్డ్ వర్క్ మంచి అవకాశాలు తెచ్చిపెడుతుందని అనుకుంటున్నాను’ అని అభిప్రాయపడింది.

Advertisement

Next Story

Most Viewed