విగ్రహాల విధ్వంసంలో చంద్రబాబు ప్రమేయం: ఎంపీ విజయసాయి

by srinivas |
విగ్రహాల విధ్వంసంలో చంద్రబాబు ప్రమేయం: ఎంపీ విజయసాయి
X

దిశ, వెబ్‌డెస్క్: పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పూర్తిగా చదివాక స్పందిస్తామని రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. సోమవారం సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోలవరం నిధులు, ప్రత్యేక హోదా, 14వ ఆర్థిక సంఘం నిధుల కోసం పార్లమెంట్‌లో పోరాడుతామని స్పష్టం చేశారు. కర్నూలుకు హైకోర్టు తరలింపు, రాష్ట్ర రెవెన్యూ లోటు, విశాఖ రైల్వేజోన్‌ అంశాన్ని పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావిస్తామన్నారు. వ్యవసాయ చట్టాలపై సీఎం జగన్ దిశా నిర్ధేశం చేశారని.. ప్రతి పంటకు కనీస మద్దతు ధర రావాలనేదే మా అభిమతం అన్నారు.

రాష్ట్రంలో దేవుడి విగ్రహాల విధ్వంసంలో చంద్రబాబు ప్రమేయం ఉందని, ఆలయాలపై టీడీపీ దాడుల ఘటనపై ప్రభుత్వం వద్ద ఆధారాలు ఉన్నాయన్నారు. టెక్కలి నంది విగ్రహం విషయంలో అచ్చెన్నాయుడు, ఓ విలేఖరి ఉన్నట్లు ఆధారాలున్నాయని, ఆలయాలపై టీడీపీ దాడులను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed