జగన్ పనితీరుకు నిదర్శనం ఇదే..

by srinivas |   ( Updated:2020-12-10 20:37:12.0  )
ycp mp vijaya sai reddy
X

దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి బాధితుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. ఈ ఘటనలో సుమారు 600 మంది వింత వ్యాధి బారిన పడగా, ప్రస్తుతం 530కు పైగా బాధితులు చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

ఈ క్రమంలోనే ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ ద్వారా స్పందించారు. అంతుచిక్కని వ్యాధితో ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్‌కు వచ్చిన రోగులకు భరోసా కల్పించడంలో డాక్టర్లు, సిబ్బంది దేవతల్లా స్పందించారు. క్షణాల్లో రోగులను తీసుకెళ్లి, చికిత్స ప్రారంభించడం కార్పోరేట్ ఆసుపత్రుల్లో కూడా కనిపించదు. సీఎం జగన్ గారి స్ఫూర్తిని అందిపుచ్చకున్న వారందరికి అభినందనలు. రాష్ట్రంలో జగన్ పనితీరుకు ఈ ఘటన అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story