- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎంపీ సంతోష్ కుమార్ కు కరోనా పాజిటివ్
దిశ, తెలంగాణ బ్యూరో : టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ కరోనా బారిన పడ్డారు. టెస్టులో పాజిటివ్ నిర్ధారణ అయినట్లు స్వయంగా ఆయనే ప్రకటించారు. ఎలాంటి లక్షణాలు లేవని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో కలిసి బుధవారం రాత్రి సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి వచ్చారు. సీఎం కేసీఆర్‌కు సీటీ స్కాన్ లాంటి వైద్య పరీక్షలు జరిగిన సమయంలో సంతోష్ ఆయన పక్కనే ఉన్నారు. ఇప్పుడు సంతోష్ కూడా కరోనా పాజిటివ్ కావడం పార్టీ వర్గాల్లో చర్చను రేకెత్తించింది. హాలియాలో జరిగిన బహిరంగసభలో మొదలైన కరోనా ఇన్‌ఫెక్షన్ చివరకు సీఎంకు, ఆయనతో నిత్యం సన్నిహితంగా ఉండే సంతోష్ దాకా వచ్చింది.
https://twitter.com/MPsantoshtrs/status/1385144221133279234
ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్ అని తేలాక కూడా యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షల కోసం వచ్చినప్పుడు పీపీఈ కిట్లు లాంటివేవీ లేకుండా సంతోష్ దగ్గరగా ఉంటూ నడుస్తుండడం వైద్య సిబ్బందినే విస్మయానికి గురిచేసింది. సోషల్ డిస్టెన్స్ లాంటి కొవిడ్ నిబంధనలు పాటించకుండా దగ్గర, దగ్గరగా నడిచినా అటు ఆస్పత్రి వర్గాలు, సెక్యూరిటీ సిబ్బంది వారించలేదు. ఇప్పుడు సంతోష్‌కు కూడా టెస్టులో కరోనా పాజిటివ్ అని తేలింది. సెక్యూరిటీ సిబ్బందిలో ఇంకెంతమంది పాజిటివ్ అవుతారో అనే ఆందోళన ఉంది.