Mamata Banerjee: వామపక్షం, కాషాయం ఒక్కటైంది.. ఇది సిగ్గుచేటు

by Shamantha N |
Mamata Banerjee: వామపక్షం, కాషాయం ఒక్కటైంది.. ఇది సిగ్గుచేటు
X

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) మోతాబ‌రిలో ఇటీవ‌ల జ‌రిగిన హింస‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కోల్ కతాలోని మసీదులో జరిగిన ఈద్ ఉల్ ఫితర్ సంబురాల్లో ఆమె పాల్గొన్నారు. అక్క‌డ ముస్లింల‌ను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్ర‌తిప‌క్ష పార్టీల‌పై విమర్శలు గుప్పించారు. వామ‌ప‌క్ష‌, కాషాయ పార్టీలు క‌లిసి ప‌నిచేస్తున్నాయ‌ని ఆమె ఆరోపించారు. మెజార్టీ, మైనార్టీ వ‌ర్గాల ర‌క్ష‌ణ‌కు త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ప‌నిచేస్తున్న‌ట్లు చెప్పారు. బీజేపీ, సీపీఐ క‌లిసి ప‌నిచేస్తున్న‌ట్లు బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఆరోపించారు. వామ‌ప‌క్షం, కాషాయం ఒక్క‌టైందని.. ఇది సిగ్గుచేటు అని చెప్పుకొచ్చారు. అల్లర్లు సృష్టించేందుకు ఆ రెండు పార్టీలు కలిసి పనిచేస్తున్నాయన్నారు. బెంగాల్ లో శాంతి, సామ‌రస్యం పాటిస్తున్నామ‌ని తెలిపారు. అన్ని మ‌తాల వారి కోసం ప్రాణ త్యాగాలు చేసేందుకు రెడీగా ఉన్నామన్నారు. మైనార్టీల‌ను ర‌క్షించ‌డం మెజార్టీల డ్యూటీ అని, ఇక మైనార్టీలు మెజార్టీల‌తో క‌లిసి ఉండాల‌న్నారు. అల్ల‌ర్లు జ‌ర‌గ‌కుండా చూసుకుంటామ‌ని, త‌మ పార్టీది ఒక‌టే గ‌ళం అని, హింస‌ను ఆపాల‌న్నారు.. కానీ, టీఎంసీ సెక్యూలర్ పార్టీ అని చెప్పుకొచ్చరు. అంతేకాకుండా, ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయని.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక్క‌డ అల్ల‌ర్లు సృష్టించేవారిపై తమ నజర్ ఉందని అన్నారు. సాధార‌ణ పౌరులు అల్ల‌ర్లు సృష్టించ‌ర‌ని, కానీ రాజ‌కీయ పార్టీలే హ‌డావుడి చేస్తున్నాయ‌న్నారు.

మోతబరిలో హింస

ఇకపోతే, మార్చి 27న మాల్దా జిల్లాలోని మోత‌బ‌రి ప్రాంతంలో హింస చెలరేగింది. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ అల్లర్లకు కారణమైన 61 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటివరకు 19 కేసులు నమోదయ్యాయి. అక్క‌డ ఇంట‌ర్నెట్ సేవ‌ల్ని నిలిపేశారు. ప్ర‌స్తుతం మోత‌బ‌రిలో ప‌రిస్థితి అదుపులో ఉన్న‌ట్లు ఏడీజీ జావెద్ షామిమ్ తెలిపారు. ఇకపోతే, ఆ హింస‌ను వ్య‌తిరేకిస్తూ శుక్ర‌వారం బీజేపీ అక్క‌డ ఆందోళ‌న చేప‌ట్టింది. మమతా బెనర్జీ రాష్ట్ర శాంతిభద్రతలపై పూర్తిగా నియంత్రణ కోల్పోయారని బీజేపీ నేత అమిత్ మాల్వియా ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ అంతటా హిందువులపై నిరంతర దాడులు అదుపు లేకుండా కొనసాగుతున్నాయి.

Next Story

Most Viewed