తెలంగాణకు సచివాలయం, ఏపీకి రాజధాని లేదు

by Shyam |
తెలంగాణకు సచివాలయం, ఏపీకి రాజధాని లేదు
X

దిశ, న్యూస్‌బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర పరిస్థితి నెలకొందని మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలతో మాట్లాడిన ఆయన… తెలంగాణకు సచివాలయం, ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదన్నారు. ఇప్పటి నుంచే ప్రణాళిక బద్ధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలని, టికెట్లు ఇవ్వలేని వారికి పార్టీలో పదవులు ఇస్తామని ఒప్పించి బయటకు వెళ్లకుండా కాపాడుకోవాలని సూచించారు. ప్రభుత్వం 2006కు ముందు మ్యాప్‌లను రద్దు చేసిందని, సచివాలయం క్యాచ్‌మెంట్ ఏరియాలో ఉందని, ఇప్పుడున్న చట్టాల ప్రకారమే అక్కడ అనుమతులు ఇవ్వాలన్నారు.

పాతబస్తీలో 14వేల ఓట్లకు ఒక డివిజన్ ఉంటే కూకట్‌పల్లి వంటి చోట్ల లక్షకు పైగా ఓట్లకు ఒక డివిజన్ ఉందని తెలిపారు. ఎంఐఎంకు అనుకూలంగా ఉన్నచోట్ల తక్కువ ఓట్లు ఉండేలా చూసారని, ఎంఐఎం, టీఆర్ఎస్ పరస్పర ఒప్పందంతో డివిజన్ల వర్గీకరణ చేశారని విమర్శించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని సూచించారు. డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల హామీపై పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. స్థానికంగా నాయకత్వాన్ని బలోపేతం చేయాలని, ప్రతిరోజు ఉదయం నాయకులు బస్తీల్లో రేవంత్‌ పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలను అస్త్రాలుగా చేసుకుని గ్రేటర్ ఎన్నికలపై పట్టు సాధించాలని, నేతలెవ్వరూ అధైర్యపడొద్దని భరోసా కల్పించారు.

Advertisement

Next Story