- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మెదక్ జిల్లా ప్రజలకు శుభవార్త.. త్వరలో..
దిశ, రామాయంపేట: చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం నిజాంపేట మండలం నస్కల్ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రైతుల సౌకర్యార్థం ఎమ్మెల్యే స్థానికంగా పెట్రోల్ బంక్ ను మంజూరు చేయించారన్నారు. వర్షాలు పడటంతో పంట దిగుబడి పెరిగిందన్నారు. రెండు పంటలను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ ప్రాంతం వ్యవసాయ ఆధారిత ప్రాంతమన్నారు. త్వరలో నిజాంపేట, రామాయంపేట మండలాలకు కాలువల ద్వారా కాళేశ్వరం జలాలు రానున్నాయన్నారు. కూడవెల్లి వాగు ఉధృతంగా పారుతుందన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఎంపీ సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ సిద్ధిరాములు, జెడ్పీటీసీ పంజ విజయ్, సర్పంచ్ లు కవిత, అమరసేన రెడ్డి, ఎంపీటీసీలు బాల్ రెడ్డి, రాజిరెడ్డి, సురేష్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.