- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
రైతులను ఆదుకోండి : ఎంపీ కోమటిరెడ్డి

దిశ, నల్లగొండ: వడగండ్ల వర్షం వల్ల నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం యాదాద్రి జిల్లాలోని యాదగిరిగుట్ట మండలం దర్మరెడ్డిగూడెం, తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ గ్రామాల్లో కురిసిన వడగండ్ల వర్షం వల్ల నష్టపోయిన రైతులను పరమార్శించారు. పంటచేలను సందర్శించి అక్కడి నుంచి కలెక్టర్‌తో నేరుగా ఫోన్‌లో మాట్లాడి రైతుల దీన స్థితి గురించి వివరించారు. ఫసల్ బీమా వర్తింప చేయాలని కోరారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వడగండ్ల వర్షం వల్ల నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.40 వేలు తగ్గకుండా పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన వెంట పీసీసీ అధికార ప్రతినిధి ఆయోద్యరెడ్డి, కాంగ్రెన్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య, జిల్లా నాయకులు కట్కూరి రాంచంద్రారెడ్డి, ఎంపీపీ చీర శ్రీశైలం, తుర్కపల్లి మండల అధ్యక్షులు వెంకటేశంగౌడ్ తదితరులు ఉన్నారు.
Tags : Komatireddy venkat reddy, inspects, farmers, fields, nalgonda, ydd