నీ ఆటలు ఇక సాగవ్ కేసీఆర్: కోమటి‌‌రెడ్డి

by Shyam |
నీ ఆటలు ఇక సాగవ్ కేసీఆర్: కోమటి‌‌రెడ్డి
X

దిశ, నల్లగొండ : ‘కబడ్దార్ కేసీఆర్.. ఇక ముందు నీ ఆటలు సాగవు. కొండపోచమ్మ ప్రాజెక్టుతో ఉమ్మడి నల్లగొండ జిల్లాను ఎడారిగా మార్చుతున్నావ్’ అంటూ సీఎం కేసీఆర్‌‌పై భువనగిరి ఎంపీ కోమటి‌‌రెడ్డి వెంకట్ రెడ్డి ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. నల్లగొండలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… నిధులు కేసీఆర్ కుటుంబానికి, నీళ్లు ఆంధ్రా ప్రాంతానికి పోతున్నాయన్నారు. ప్రాజెక్టుల విషయంలో కేసీఆర్‌ను ప్రజలు రాళ్లతో కొట్టే రోజులు వస్తాయని, పోతిరెడ్డిపాడు వ్వవహారాన్ని పక్కదోవ పట్టించేందుకే కొండపోచమ్మ సంబరాలు చేస్తున్నాడని మండిపడ్డారు. కొండపోచమ్మ ద్వారా ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు విస్తరణ జీవో 203ను తక్షణమే రద్దు చేయాలని, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంతో నాగార్జునసాగర్‌కు చుక్క నీరు రాదని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌తో కలిసి కేసీఆర్ దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తున్నాడని, ఎడారి చేయడమే లక్ష్యంగా కుట్ర పన్నారని విమర్శించారు. కమీషన్ల కోసమే గోదావరి నీళ్లను కృష్ణాలో కలుపుతామంటున్నారని ఎద్దేవా చేశారు. గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లను పక్కన పెట్టారని, అందుకే కాంగ్రెస్ శ్రేణులు నిరసన వ్యక్తం చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వంపై పోరాటానికి తామంతా సిద్ధమని, జూన్ 2న ప్రాజెక్టుల వద్ద ధర్నాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గానికి వెయ్యి కోట్లు మంజూరు చేస్తే పూర్తి అయ్యేదన్నారు. అంతకుముందు నల్లగొండలోని మామిళ్లగూడెంలో కరోనాతో చనిపోయిన కానిస్టేబుల్ దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఎంపీ కోమటి‌‌రెడ్డి పరామర్శించారు. దయాకర్ రెడ్డి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed