- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జెట్ స్పీడ్‌లో దూసుకెళ్తోన్న కోమటిరెడ్డి.. దానిపైనే ప్రత్యేక దృష్టి
దిశ, భువనగిరి: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష(టీపీసీసీ) పదవి ఆశించి, నిరాశ చెందిన కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్లమెంట్ పరిధి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారు. అందులో భాగంగానే గత పదిరోజుల నుంచి అధికారులతో, ప్రజాప్రతినిధులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా.. మంగళవారం ఎన్‌హెచ్ సీజీఎం కృష్ణప్రసాద్, జీఎం నాగేశ్వరరావు, జీఎం కిషోర్, రఘునాథ్ ఫులేలతో హైదరాబాద్‌లోని రీజనల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ… ఇప్పటికే టెండర్లు పూర్తైన పనులు తక్షణమే ప్రారంభించాలని, హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అండర్ పాస్ బ్రిడ్జిల నిర్మాణం త్వరగా చేపట్టాలని సూచించారు.
ఈనెల 19 నుంచి జరుగబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ సమస్యలను లేవనెత్తి సర్కార్‌పై ఒత్తిడి తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అన్నారు. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై పలు బ్రిడ్జిలకు నిధులు మంజూరయ్యాయని అన్నారు. ఇంతకాలం కరోనా వ్యాప్తి కారణంగా పనులు ప్రారంభం కాలేదని వివరించారు. వెంటనే నిర్మాణ పనులు చేపట్టాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. జాతీయ రహదారి పొడవునా పట్టణాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి కాబట్టి పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. అధిక ట్రాఫిక్ వల్ల ఆయా ప్రాంతాల్లో ప్రజలు, ప్రయాణికులకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ నిర్మాణాలు త్వరగా పూర్తైతే ప్రజల ఇబ్బందులు తొలుగుతాయని తెలిపారు.