- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
సీబీఐ సోదాలపై స్పందించిన కవిత.. ఆమె ఏమన్నారంటే..
దిశ, వెబ్ డెస్క్ : సీబీఐ సోదాలపై మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత స్పందించారు. ఢిల్లీలో నాకు పీఏలు ఎవరూ లేరని కవిత వెల్లడించారు. తాజాగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో తన డ్రైవర్ దుర్గేష్ తప్ప మిగిలిన ముగ్గురు వ్యక్తులు తనకు తెలియదని చెప్పారు. దుర్గేష్ ఇటీవలే కాంట్రాక్ట్ వాహనం డ్రైవర్‌గా చేరాడని అన్నారు. రెండు నెలల క్రితమే క్వార్టర్స్ ఇచ్చినట్టు తెలిపారు. స్టాఫ్ క్వార్టర్‌ను డ్రైవర్ దుర్గేష్‌కు ఇచ్చినట్టు వెల్లడించారు. దుర్గేష్ తప్ప మిగిలిన ముగ్గురిపై ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
విషయం ఏంటంటే..
ముగ్గురు వ్యక్తులు ఏకంగా దేశరాజధానిలో ఎంపీ కవిత పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడ్డారు. బెదిరించి మరీ లక్షల రూపాయలను దోచుకున్నారు. ఢిల్లీలోని ఓ ఇంటి యజమాని వద్దకు వచ్చిన ముగ్గురు వ్యక్తులు(రాజీబ్ భట్టా చార్య, సుభాంగిగుప్తా, దుర్గేష్ కుమార్) ఎంపీ మాలోతు కవిత పీఏలమంటూ అతడిని బెదిరించారు. ఇళ్లు అక్రమ నిర్మాణం అంటూ డబ్బులు డిమాండ్ చేశారు. రూ. 5 లక్షలు డిమాండ్ చేయడంతో దిక్కుతోచని మన్మిత్‌సింగ్ లంబా (బాధితుడు) సీబీఐని ఆశ్రయించాడు. దీంతో పథకం ప్రకారం సరిగ్గా డబ్బులు ఇచ్చే సమయంలో సీబీఐ దాడులు చేసింది. సదరు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతుండగా.. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.